ఈగ నిర్మాత‌ దూకుడు

sai korrapatiఈగ సినిమాతో వారాహి చ‌ల‌న చిత్ర ప‌తాకం కూడా ఫేమ్‌లోకి వ‌చ్చింది. నిర్మాత‌ సాయి కొర్రపాటికి మంచి లాభాలు తీసుకొచ్చిందీ సినిమా. ఆ త‌ర‌వాత బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌నివాస్ సినిమాకి ఈ సంస్థ భాగ‌స్వామిగా చేరింది. పెద్ద సినిమాలే కాదు, ఇప్పుడు చిన్న సినిమాల‌పై దృష్టి సారించింది వారాహి చ‌ల‌న చిత్ర. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కిస్తోంది. ఇదే కాకుండా, కొత్త న‌టీన‌టుల‌తో మ‌రో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లనుంది. ఈ రెండు సినిమాలూ వినాయ‌క చవితి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొన్నాయి. హాస్య న‌టుడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ద‌ర్శకుడిగా మార‌డం ప‌రిశ్రమ‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. హాస్య న‌టుడిగా పూర్తి స్థాయిలో నిల‌దొక్కుకోలేని అవ‌స‌రాల… ఇప్పుడు ద‌ర్శకుడిగా సెటిల‌వుతాడా? అనేదే ప్రధాన ప్రశ్న. దానికి తోడు ద‌ర్శకులుగా మారిన హాస్య న‌టులు విజ‌యాలు సాధించిన దాఖ‌లాలు లేవు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి అత‌ను గ‌ట్టెక్కితే చూడాల‌న్నది అంద‌రి ఆశ‌.