తెలుగులో లిప్‌లాక్ అంటే ఓ.. ఆ.. అంటూ ఆశ్చర్యపోతారు కానీ బాలీవుడ్లో లిప్ కిస్‌లు చాలా కామన్. ఈ లిప్కిస్లను పెళ్లి అయ్యే వరకు బాగానే ఎంజాయ్ చేస్తారు కానీ ఆ తర్వాత లైఫ్ పార్టనర్ ప్రభావం ఉంటుంది. వచ్చిన వారు ఒప్పుకుంటే మళ్లీ లిప్‌కిస్‌లు ఇస్తారు కానీ నో అంటే మాత్రం వాటి జోలికి పోకుండా కేవలం రొమాంటిక్ సన్నివేశాల్లో పాల్గోంటారు. తనంత కూతురు ఉన్నా కూడా కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్‌ను ప్రేమించి పెళ్లాడిరది. పెళ్లికి ముందు ఈ ఇద్దరు పెళ్లయ్యాక సినిమాలలో లిప్‌లాక్‌లు చేయకూడదు అంటూ గట్టిగా డిసైడ్ అయ్యి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరు కూడా పలు చిత్రాల్లో వేరే వ్యక్తులకు లిప్‌లాక్ ఇచ్చేశారు.
దీనికి కారణం సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. తాజాగా ఓ టీవీ షోలో మాట్లాడిన కరీనా కపూర్ ఈ విషయాన్ని వెల్లడిరచింది. సారా తన తండ్రి సైఫ్‌తో సినిమా అనే మహా ప్రపంచంలో అన్ని అవసరమే, సినిమా ఓ కళాత్మకమైన వ్యాపారం, కథ డిమాండ్ చేసినప్పుడు లిప్‌లాక్ చేస్తే తప్పేం లేదు అంటూ తండ్రితో చెప్పిందట. దాంతో సైఫ్ విధానం మారి ఆ తర్వాత పలు లిప్‌లాక్‌లు ఇచ్చేశాడట. అంతేకాకుండా కరీనా కూడా వేరే హీరోలతో పెళ్లయ్యాక కూడా లిప్‌లాక్ చేసింది. తల్లితో విడిపోయినా కూడా సారా తండ్రితో టచ్‌లో ఉంటూ సినీ రంగంలో తండ్రికి సలహాలు కూడా ఇస్తుంది. ఈ విషయంలో కరీనా, సారాలకు మంచి స్నేహం ఏర్పడిరదట. భర్త మొదటి భార్య కూతురితో కరీనాకు ఇంత మంచి సంబంధం ఉంది అంటే ఆశ్చర్యకర విషయమే.