ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా రావణాసురుడు..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ‘NTR30’. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. తాజాగా ఎన్టీఆర్‌కి బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌ తోడయ్యారు.

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే విషయాన్నీ ధ్రువీకరిస్తూ చిత్ర యూనిట్ ఫోటోలను విడుదల చేసింది. ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సినిమాలో నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ జాయిన్‌ అయ్యాడు అంటూ సైఫ్‌తో తారక్‌, కొరటాల శివ కలిసి ఉన్న ఫోటోలు షేర్‌ చేశారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’లో రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్.. ఇప్పుడు ఎన్టీఆర్ తో సెట్స్ మీదకు రావడం ఆసక్తికర అంశం. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.