మలర్ ని చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఒక్క సినిమాతో పాపులరైపోయిన హీరోయిన్ సాయి పల్లవి. మలయాళంలో ”ప్రేమమ్” సినిమాలో మలర్ అనే క్యారక్టర్ చేసి అందరికీ దగ్గరైంది సాయి. ఈ సినిమాతో యువత హృదయాల్ని కొల్లగొట్టేసింది. ఈ సినిమా తర్వాత సాయికి చాలా ఆఫర్లు అందాయి. ఇప్పుడు ఆమె చేతిలో మూడు సినిమాలు వున్నాయి. ఇందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘ఫిదా’ ఒకటి.

దిల్‌రాజు నిర్మాత. సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ‘ఫిదా’ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ చూసిన ప్రేక్షకులు సాయి పల్లవికి ‘ఫిదా’ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు. చిత్రానికి శక్తికాంత్‌ మ్యూజిక్.