Site icon TeluguMirchi.com

పెళ్లి ఫై సాయి పల్లవి క్లారిటీ..

ఫిదా , ప్రేమమ్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సాయి పల్లవి..ఆ తర్వాత పలు క్రేజ్ ఛాన్సులు వచ్చిన్నప్పటికీ వాటిని వదులుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన చిత్రాలన్నీ భారీ ప్లాప్స్ కావడం తో అమ్మడి క్రేజ్ అంత తగ్గిపోవడమే కాదు అమ్మడి వైపు చూసే దర్శక , నిర్మాతలు కూడా కరవయ్యారు. అరే ఇదేంటి ఇలా అయ్యిందేంటి అని సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడుతుందట. ఇక ఈ విషయం పక్కన పెడితేహ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి అభిమానులకు షాక్ & సంతోషాన్ని కలిగించింది.

మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు..? ఎవరినైనా ప్రేమిస్తున్నారా..? ప్రేమించి పెళ్లి చేసుకుంటారా..లేక తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకుంటారా..అని మీడియా అడుగగా.. తాను అసలు పెళ్లే చేసుకోను అని చెప్పి షాక్ ఇచ్చింది. కారణం ఏమిటంటే తాను పెళ్లి చేసుకుంటే తన తల్లిదండ్రులను చూసుకోవడం కుదరదని .. అందుకే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను అని తెలిపింది. మరి నిజంగానే ఇలా ఒంటరిగా ఉంటుందా..లేక కొన్ని రోజుల తర్వాత పెళ్లి ఫై గాలి మళ్లుతుందా అనేది చూడాలి.

Exit mobile version