కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవితం రోడ్డున పడింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఛారిటీకి చాలామంది తమవంతు విరాళాలు ప్రకటించగా..తాజాగా సాయి కుమార్ తనవంతు సాయాన్ని అందజేశారు. “సి సి సి కి 500004 రూపాయలు విరాళం, అలాగే డబ్బింగ్ యూనియన్ కు మరో రెండు లక్షల ఎనిమిది రూపాయలు విరాళం” అందజేశారు.
అలాగే కరోనా మహమ్మారి నివారణార్ధం హీరో సాగర్ (మొగలిరేకులు ఫేమ్ ఆర్ .కె నాయుడు) సి.ఎం. రిలీఫ్ ఫండ్ కు ఐదు లక్షలు సహాయాన్ని నేడు తెలంగాణ మంత్రి వర్యులు కె టి ఆర్ కు అందజేశారు.