సాయిధరమ్ తేజ్.. ఈసారి పవన్ రీమిక్స్

గోలీమార్’ .. ‘అందం హిందోళం’ .. ‘గువ్వా గోరింకతో’ ఇప్పుడు ‘ఇంటిలిజెంట్’లో ‘ఛమక్ ఛమక్ ఛామ్’ సాంగ్ .. ఇలా రీమిక్స్ కింగ్ గా పాటలు చేసుకుంటూ పోతున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఇక తన తదుపరి సినిమాల్లో పవన్ సినిమాల్లోని పాటలను కూడా రీమిక్స్ చేయనున్నట్టు చెబుతున్నాడు.

పవన్ సినిమాల్లోని పాటలంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పిన సాయిధరమ్ తేజ్, ‘తొలిప్రేమ’లోని ‘ఈ మానసే .. ‘ .. ‘జానీ’ సినిమాలోని ‘నా రాజు గాకురా అన్నయ్య’ అనే పాటను రీమిక్స్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. త్వరలోనే కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్ .. ఈ సినిమా ‘ఈ మానసే .. ‘ పాటను రీమిక్స్ చేస్తాడని తెలుస్తుంది.