Site icon TeluguMirchi.com

‘ విన్నర్ ‘ ఫస్ట్ లుక్

sai-winnerసాయి ధరమ్ తేజ్ – రకుల్ ప్రీతి సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘విన్నెర్ ‘ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈరోజు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా ఈ టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది.

ఈ లుక్ లో సాయి డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపించదు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న తేజ్ కు తిక్క రూపం లో గట్టి దెబ్బ తగిలింది. ప్రస్తుతం ఈ విన్నర్ ఫై గట్టి నమ్మకాలు పెట్టుకున్నాడు. మరి తేజ్ ఖాతాలో విన్నెర్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.నల్లమలుపు శ్రీనివాస్ .. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తో పాటు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం ‘ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు.

Exit mobile version