Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్‌ కొత్త సినిమా అనౌన్స్మెంట్.. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ?


విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్‌ బస్టర్‌ విజయాల తరువాత సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన కథానాయకుడు సాయి ధరమ్ తేజ్‌ ఈ సారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను నిర్మాతలు ఈరోజు విడుదల చేశారు.

Pottel : హార్ట్ టచింగ్ గా ‘పొట్టెల్’ నుండి ‘బుజ్జి మేక’ సాంగ్..

ల్యాండ్ మైన్‌లతో చుట్టుముట్టబడిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పోస్టర్‌ చూస్తుంటే ఓ యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈచిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోంది.

Kalki 2898 AD : ఆ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథే ‘కల్కి 2898 AD’..

అంతేకాదు ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌తో, భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్‌ పాత్ర చాలా శక్తివంతంగా వుంటుంది. ఈ చిత్రం కోసమే నిర్మించిన ఓ భారీ సెట్‌ లో ప్రస్తుతం ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.