సాహో కలెక్షన్స్ స్పైడర్ కన్నా దారుణం..

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే స్పైడర్ చిత్రం దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మహేష్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కానీ ఫస్ట్ డే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ చిత్ర కలెక్షన్లు కూడా సాహో రాబట్టలేకపోవడం ఇంకా దారుణంగా మారింది.

ప్రభాస్ – సుజిత్ కలయికలో దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య నాల్గు భాషల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. హాలీవుడ్ స్థాయి లో సినిమా తెరకెక్కినప్పటికీ..ఆ స్థాయి లో కథ కథనం లేదని తేల్చేస్తున్నారు. ఈ చిత్ర టాక్ ప్రభావం ఓవర్సీస్ కలెక్షన్ల ఫై గట్టిగా పడింది.

తొలిరోజు(గురువారం) అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘సాహో’ 820,000 డాలర్లు మాత్రమే రాబట్టింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.8కోట్లు. మహేశ్ బాబు కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన ‘స్పైడర్’ తొలిరోజు 1 మిలియన్ డాలర్లన్నా రాబట్టింది. కానీ ‘సాహో’ ఆ మాత్రం కూడా రాబట్టలేకపోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలా రాబడుతుందో చూడాలి.