Site icon TeluguMirchi.com

రెండు నిమిషాల టీజర్ కోసం రూ. 15 లక్షలు..?

యువీ క్రియేషన్స్ వారు సాహో కోసం డబ్బును ఓ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారు..సినిమా ఫలితం ఎలా ఉంటుందో కానీ వీరు పెట్టె ఖర్చు చూసి మాత్రం అంత షాక్ అవుతున్నారు. ఇప్పటికే సినిమా బడ్జెట్ 300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తుండగా..ఇంకా చిన్న చిన్న వాటికీ కూడా లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. తాజాగా రెండు నిమిషాల నిడివి టీజర్ కోసం ఏకంగా 15 లక్షల ఖర్చు చేశారట. సాహో సరికొత్త టీజర్ ను రంజాన్ కానుకగా విడుదల చేయబోతున్నారు. 1 నుంచి 2 నిమిషాల మధ్యలో టీజర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ టీజర్ కోసం యూనిట్ ఏకంగా రూ. 15 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం.

టీజర్ కు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందనే సందేహం రావొచ్చు ..టీజర్ అంటే సినిమాలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను రెండు నిమిషాల్లోపు చూపించాలి. అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉండాలి. ఈ టీజర్ కోసం ఏకంగా బాలీవుడ్ నుంచి మ్యూజిక్ తీసుకున్నారని, అదిరిపోయే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ ఉంటుందని అంటున్నారు. మరి వారు చెప్పినట్లు టీజర్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇప్పటివరకు విడుదలైన ఏది కూడా అభిమానులను అంత ఆకట్టుకోలేదు. మరి ఈ టీజర్ అయినా ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి .

Exit mobile version