Site icon TeluguMirchi.com

సాహో జాతకం తేలనుందా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతుండడం..బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం తో దీని ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయినా చిత్ర పోస్టర్స్ , ఫస్ట్ లుక్ టీజర్ అనుకున్న రీతిలో ఆకట్టుకోకపోవడం తో రేపు విడుదలై టీజర్ ఫైనే అందరి ఆసక్తి నెలకొని ఉంది.

ప్రస్తుతం టీజర్ ఓ స్థాయి లో ఉండబోతుందని..యాక్షన్ మూడ్ లో సాగుతుందని..రెండు భారీ యాక్షన్ ఛేజింగ్ సీన్స్ ను ఉన్నాయని ప్రచారం జరుగుతుండడం తో ఆ టీజర్ బట్టి సినిమా ఏ స్థాయి లో ఉంటుందో అర్థమవుతుందని దానిని బట్టి సినిమా ఫై ఓ అంచనా వేసుకోవచ్చని అంత మాట్లాడుకుంటున్నారు.

సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతుంది. ప్రభాస్ , శ్రద్ద లపై ఓ సాంగ్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. ఈ సాంగ్ షూట్ తో సినిమా షూటింగ్ అంత పూర్తయినట్లే..యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషల్లో ఆగస్టు 15 న విడుదల కాబోతుంది.

Exit mobile version