Site icon TeluguMirchi.com

సాహో రైట్స్ దక్కించుకున్న టి-సిరీస్

బాహుబలి చిత్రం తో ప్రభాస్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు పెరిగి పోయారు. ఆయన నుండి సినిమా వస్తుందంటే వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సాహో ఫై అన్ని భాషల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ప్రభాస్ బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ చిత్ర రైట్స్ కోసం అన్ని సంస్థలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యం లో ‘సాహో’ థియేట్రికల్, డిజిటల్ రైట్స్ రెండింటిని టి-సిరీస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎంత మొత్తానికి ఈ హక్కులను కొనుగోలు చేశారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముకేష్, జాకీ స్రాఫ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, చంకీ పాండే వంటి వారు నటిస్తుండడం తో హిందీ ప్రేక్షకులు సైతం ఆసక్తి గా ఉన్నారు.

Exit mobile version