Site icon TeluguMirchi.com

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : సాహో టీజర్ వచ్చేస్తుంది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో సరికొత్త టీజర్ ఈ నెల 13 న రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ , మేకింగ్ స్టిల్స్ , పోస్టర్స్ సినిమా ఫై తారాస్థాయి లో అంచనాలు పెంచగా..ఇప్పుడు రాబోతున్న సరికొత్త టీజర్ ఇంకెన్ని అంచనాలు పెంచేస్తుందో..ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు.

సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతుంది. ప్రభాస్ , శ్రద్ద లపై ఓ సాంగ్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. ఈ సాంగ్ షూట్ తో సినిమా షూటింగ్ అంత పూర్తయినట్లే..యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషల్లో ఆగస్టు 15 న విడుదల కాబోతుంది.

Exit mobile version