సాహో న్యూ టీజర్ హైలైట్స్ ఇవేనట..

అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో సరికొత్త టీజర్ ఈ నెల 13 న రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ , మేకింగ్ స్టిల్స్ , పోస్టర్స్ సినిమా ఫై తారాస్థాయి లో అంచనాలు పెంచగా..ఇప్పుడు రాబోతున్న సరికొత్త టీజర్ ఇంకెన్ని అంచనాలు పెంచేస్తుందో..ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అంత వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టీజర్ లో హైలైట్స్ ఇవేనంటూ కొన్ని కధనాలు మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

టీజర్ అంత కూడా యాక్షన్ మూడ్ లో సాగుతుందట..ఇక టీజర్ లో ప్రభాస్ కు సంబందించిన రెండు యాక్షన్ ఛేజింగ్ సీన్స్ ను చూపించబోతున్నారట. అందులోనే హీరోయిన్ శ్రద్ద కపూర్ గన్ పట్టుకొని పరుగెడుతున్నట్లు చూపించబోతున్నారని అంటున్నారు. అలాగే టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని..ఎంతోకాలంగా మంచి ఆకలితో ఉన్న ప్రభాస్ అభిమానులకు ఈ టీజర్ ఫుల్ బోజనమే అని అంటున్నారు.

సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతుంది. ప్రభాస్ , శ్రద్ద లపై ఓ సాంగ్ చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. ఈ సాంగ్ షూట్ తో సినిమా షూటింగ్ అంత పూర్తయినట్లే..యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషల్లో ఆగస్టు 15 న విడుదల కాబోతుంది.