Site icon TeluguMirchi.com

సాహో గురించి తెలిసింది గోరంతే..తెలియంది కొండత..

ప్రస్తుతం ఎక్కడ చూసిన..ఏ నోటా విన్న ఒకే ఒకమాట అదే సాహో…సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. మనం చూస్తున్నది తెలుగు సినిమానా లేక హాలీవుడ్ సినిమా నా అనే రేంజ్ లో ఈ మూవీ ఉండబోతుందని..యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే రెండు కళ్లు చాలవని అంత చెపుతున్నారు. కానీ ఇప్పటివరకు సాహో గురించి తెలిసింది గోరంతే..అని తెలియంది కొండత అని చిత్ర యూనిట్ చెపుతున్నారు.

సాహో సినిమా ట్రయిలర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్ రాజా రన్ టైపు సినిమాను లార్జ్ స్కేల్ లో, భారీగా చూస్తే ఎలా వుంటుందో, సాహో కూడా అలా వుండబోతోందని.. ఎత్తులు పై ఎత్తులు, రేస్ లు, యాక్షన్ ఎపిసోడ్ లు యాడెడ్ అట్రాక్షన్ ఇలా అబ్బా ఏమన్నా సినిమా అని ప్రతి ఒక్కరు అనుకోవడం ఖాయమట. సినిమాలో ఓ అట్రాక్షన్ వుంటుందని… ‘జెట్ ప్యాక్’ లాంటి పరికరం సాయంతో హీరో అనుకున్నపుడల్లా గాల్లోకి ఎగిరి, విన్యాసాలు చేసే సీన్లు వుంటాయని, అవి చాలా బాగా అలరిస్తాయని తెలుస్తోంది. మొత్తం మీద తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని రేంజ్ లో సినిమా ఉంటుందని చెపుతున్నారు.

Exit mobile version