ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సుజీత్ ఈ చిత్రంను 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ వారు ఎక్కడ కూడా తగ్గకుండా రికార్డు స్థాయి బడ్జెట్‌తో నిర్మించడం జరిగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం మరియు కన్నడంలో కూడా ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిన ఈ చిత్రం అంచనాలను మరింతగా పెంచేందుకు ట్రైలర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కట్ చేసినట్లుగా తెలుస్తోంది.
దాదాపుగా రెండు నిమిషాలుండే సాహో ట్రైలర్ సినిమా స్థాయిని చూపించే విధంగా ఉంటుందట. బాలీవుడ్లో ఇప్పటి వరకు ఏ మూవీ ట్రైలర్ కూడా దక్కించుకోని రికార్డులను ఈ చిత్రం యూట్యూబ్‌లో దక్కించుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఈ చిత్రం కేవలం హిందీలోనే కాకుండా పలు భాషల్లో ట్రైలర్ విడుదల కాబోతుంది. అందుకే రికార్డు స్థాయి వ్యూస్‌ను దక్కించుకోబోతుందని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.