Site icon TeluguMirchi.com

తెలుగు బిగ్‌బాస్‌లో ‘సాహో’ స్టార్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రతి వారం ఏదో ఒక సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాహో చిత్రం ప్రమోషన్స్‌ కోసం బిగ్‌బాస్‌ను వాడేసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ హౌస్‌లోని ప్రభాస్‌ వెళ్లి వచ్చాడు. అందుకు సంబంధించిన ప్రచారం అయితే అప్పుడే జరుగుతోంది. ప్రభాస్‌ కన్ఫెషన్‌ రూంలో ఉన్న ఫొటో కూడా ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్‌ వెళ్లినప్పటి ఎపిసోడ్‌ నేడు కాని రేపుకాని ప్రసారం అయ్యే అవకాశం ఉంది. హిందీ వర్షన్‌ కోసం పలు రియాల్టీ షోలకు హాజరు అయిన ప్రభాస్‌ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి కూడా వెళ్లబోతున్నాడు. ఇంటి సభ్యులతో సరదాగా గడపడంతో పాటు, అద్బుతంగా వారితో ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడు. ప్రభాస్‌ ఎంట్రీతో గత కొన్ని రోజులుగా ఢీలా పడిపోయిన బిగ్‌బాస్‌ ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై అధికారికంగా ప్రోమో రాలేదు. ప్రభాస్‌ రాక కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version