సాహో చిత్రం ఫై నెగిటివ్ ప్రచారం..ఇది వారిపనేనా..?

‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. ‘బాహుబలి’తో ఇండియన్ సినిమాతో పాటు వరల్డ్ సినిమా హిస్టరీలో ప్రభాస్ తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్నారు. దీంతో సాధారణంగానే ‘సాహో’పై అంచనాలు పెరిగిపోయాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ గత సినిమాతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించడం..ట్రైలర్ అంత హాలీవుడ్ స్థాయి సినిమా ఉందని చెప్పడం..బాలీవుడ్ అగ్ర నటి నటులు నటించడం తో సినిమా ఫై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా గాని హిట్ అయితే ప్రభాస్ టాలీవుడ్ నెం వన్ హీరో కావడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో సాహో ఫై నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

సినిమా ఎక్కడ కూడా ఇంకా విడుదల కాలేదు..ఈ లోపే సాహో కథ రొటీన్‌గా ఉందని.. సాంగ్స్‌తో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ పేలవంగా ఉందని.. సెకండాఫ్ బాగుందని.. ఫస్టాఫ్ యావరేజ్ గా ఉందని సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రభాస్ యాక్షన్‌తో ఇంటర్వెల్‌కి ముందు వచ్చే 20 నిమిషాలు, క్లైమాక్స్‌లో వచ్చే 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పడం కొస మెరుపు. ఇక హిందీ వర్షన్‌లో చూశామని ఇంకొంతమంది చెపుతున్నారు. ప్రభాస్ డబ్బింగ్ అస్సలు కుదర్లేదని.. శ్రద్ధా కపూర్ యాక్టింగ్ కూడా బాలేదంటున్నారు. దీంతో పాటు దాదాపు సినిమా నిడివి బాగా ఎక్కువగా ఉందంటూ టోటల్‌గా సినిమా నచ్చలేదని రేటింగ్ కూడా 2/5 అని ఇస్తున్నారు. మరి ఇదంత చూస్తుంటే కావాలనే ప్రభాస్ ఇమేజ్ చూసి తట్టుకోలేని వారే ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ప్రభాస్ అభిమానులు చెపుతున్నారు.