Site icon TeluguMirchi.com

సాహో ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసా..?

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం భారీ అంచనాల మధ్య తెలుగు , తమిళ్ ,హిందీ , మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయ్యింది. భారీ బడ్జెట్ , భారీ కాస్ట్ & క్రూ అంతకు మించి బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమాను భారీ థియేటర్స్ లలో రిలీజ్ చేసారు. దీంతో మొదటి రోజు కలెక్షన్లు దుమ్ము దూలపడం ఖాయమని..గత రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

ప్రస్తుతం వారి లెక్కలు ఇలా ఉన్నాయి. ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి దాదాపు 60-70కోట్లు కలెక్ట్‌ చేయవచ్చని అంటున్నారు. తెలుగులో 35, హిందీలో 15-20, తమిళంలో 15కోట్లు మలయాళంలో 5కోట్ల వరకు వసూళ్లను సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. మరి వీరి లెక్కలు కరెక్ట్ అవుతాయో లేదో చూడాలి. ఎందుకంటే సినిమాకు నెగిటివ్ టాక్ విపరీతం అయ్యింది. ఫ్యాన్స్ సూపర్ హిట్ అంటున్న..సాధారణ సినీ ప్రేక్షకులు , విశ్లేషకులు మాత్రం సినిమా పెద్దగా లేదని తేల్చేస్తున్నారు. ఈ టాక్ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్ల ఫై గట్టిగా పడనుంది.

Exit mobile version