ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన మేకింగ్ వీడియోలు ట్రైలర్ టీజర్ ఇలా ప్రతి విషయంలో కూడా సినిమా భారీ ఎత్తున అంచనాలను పెంచే విధంగా ఉంది. రికార్డు స్థాయిలో ఈ చిత్రం దుమ్ము రేపడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో సినిమా ఫైనల్ ఎడిట్ తర్వాత మూడు గంటలకు ఏడు నిమిషాల వరకు వచ్చిందట. అయితే ఎంత మంచి సినిమా అయినా కొన్ని సీన్స్ లెంగ్తీగా ఉంటే ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆ లెంగ్త్‌ను తగ్గించే ప్రయత్నం చేశారు.
పలువురు సినీ ప్రముఖులతో చర్చలు జరిపి మరోసారి ఎడిటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజమౌళి సాహో కోసం కత్తెర పట్టుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ అయితే రాలేదు. కాని మూడు గంటలకు పైగా ఉన్న సినిమాను 2 గంటల 48 నిమిషాలకు తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఇదే నిడివితో సెన్సార్ ముందుకు కూడా వెళ్లబోతుంది. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు ఉంది. అయినా అప్పుడే హడావుడి మొదలు అయ్యింది. మొత్తానికి సాహో చిత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే అప్పుడు ఒక పది నిమిషాల సీన్స్‌ను యాడ్ చేసే ఉద్దేశ్యంలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.