ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత ‘సాహో’ చిత్రాన్ని 350 కోట్లతో చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన సాహో చిత్రంను చూడాలని ప్రభాస్ అభిమానులతో పాటు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా సినిమా విడుదలైన తర్వాత బాబోయ్ నీకో దండం అంటూ ప్రభాస్‌పై విమర్శలు చేస్తున్నారు. సాహో సినిమాకు 350 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
తాజాగా సాహో ప్రీమియర్ చూసిన ఒక అభిమాని సినిమా చూసిన తర్వాత తన ఫ్రస్టేషన్‌ను వీడియో రూపంలో సోషల్ మీడియాలో వదిలాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాహో చిత్రం చూడాలని ఆఫీస్ నుండి డైరెక్ట్‌గా థియేటర్‌కు వచ్చాను. సీట్లు దొరుకుతాయో లేదో అని ఆగం ఆగంగా వస్తే సినిమా ఫలితం తారు మారైందని, పరిస్థితి అతలాకుతలం అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.
https://twitter.com/i/status/1167392233865170944