శుక్రవారం మొదటి రోజు కనుక వసూళ్లు భారీగా వచ్చాయి, రెండవ రోజు మరియు మూడవ రోజు శని ఆదివారాల కారణంగా సినిమా ఆడింది. ఇక నాల్గవ రోజు వినాయక చవితి సందర్బంగా కూడా మంచి షేర్ దక్కింది. కాని నేడు అంటే అయిదవ రోజు నుండి ఈ సినిమాకు అసలు కష్టాలు మొదలు అవ్వనున్నాయి. ఈ వీక్ డేస్లో వసూళ్లు రాబడితే 250 కోట్ల వరకు సినిమా వెళ్లే అవకాశం ఉంది. కాని సినిమా విడుదల సమయంలో వచ్చిన నెగటివ్ టాక్ కారణంగా నేటి నుండి వసూళ్ల విషయంలో కష్టాలు ఉండవచ్చు. నేడు పరిస్థితి ఏంటీ అనేది రేపటి వరకు తేలిపోనుంది.