నేటి నుండి సాహోకు అసలు కష్టాలు

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా దాదాపుగా నాలుగు రోజుల్లో 175 కోట్ల వరకు రాబట్టింది. ఇంతటి భారీ వసూళ్లను చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఊహించలేదు. మొదటి రోజ చెత్త అంటూ టాక్‌ వచ్చిన నేపథ్యంలో కలెక్షన్స్‌ ఇంతగా వస్తాయని ఊహించని వారు ఈ స్తాయి కలెక్షన్స్‌కు ఆశ్చర్య పోతున్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు కలెక్షన్స్‌ సునామి అన్నట్లుగా వచ్చాయి. ఇప్పుడు అసలు పరీక్ష సినిమాకు మొదలు కాబోతుంది.

శుక్రవారం మొదటి రోజు కనుక వసూళ్లు భారీగా వచ్చాయి, రెండవ రోజు మరియు మూడవ రోజు శని ఆదివారాల కారణంగా సినిమా ఆడింది. ఇక నాల్గవ రోజు వినాయక చవితి సందర్బంగా కూడా మంచి షేర్‌ దక్కింది. కాని నేడు అంటే అయిదవ రోజు నుండి ఈ సినిమాకు అసలు కష్టాలు మొదలు అవ్వనున్నాయి. ఈ వీక్‌ డేస్‌లో వసూళ్లు రాబడితే 250 కోట్ల వరకు సినిమా వెళ్లే అవకాశం ఉంది. కాని సినిమా విడుదల సమయంలో వచ్చిన నెగటివ్‌ టాక్‌ కారణంగా నేటి నుండి వసూళ్ల విషయంలో కష్టాలు ఉండవచ్చు. నేడు పరిస్థితి ఏంటీ అనేది రేపటి వరకు తేలిపోనుంది.