ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సాహోను భారీ ఎత్తున రేట్లకు అన్ని ఏరియాల్లో అమ్మేయడం జరిగింది. నైజాం మరియు వైజాగ్ ఏరియాలను దిల్‌రాజు దాదాపుగా 46 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. నైజాం ఏరియాలో భారీగానే సాహో ఓపెనింగ్స్ వచ్చాయి. కాని సినిమా భారీ రేటుకు కొనుగోలు చేసిన నేపథ్యంలో దిల్‌రాజు కాస్త నష్టపోక తప్పదని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సాహో చిత్రం మొదటి వారంలో నైజాంలో 28 కోట్లు మరియు వైజాగ్‌లో 10 కోట్ల వరకు రాబట్టింది. అంటే మొత్తంగా 38 కోట్లు దిల్‌రాజు దక్కించుకున్నాడు. రాజుగారికి బ్రేక్ ఈవెన్ దక్కాలి అంటే ఇంకా 8 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. అంత భారీ స్థాయిలో సాహో రాబట్టే అవకాశం దాదాపుగా లేదనిపిస్తుంది. మరో రెండు లేదా మూడు కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉంది. అంటే అటు ఇటుగా 5 కోట్లు దిల్‌రాజుకు బొక్క పడే అవకాశం ఉంది. సాహో ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా కూడా అదృష్టం కొద్ది దిల్‌రాజు కొద్ది నష్టంతో బయట పడబోతున్నాడు.