సాహో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 550 నుండి 650 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. అదే సైరా చిత్రం మాత్రం 250 కోట్ల వరకు లాక్కువస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక ముఖ్యంగా బాలీవుడ్ విషయానికి వస్తే సాహో చిత్రంను బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ 80 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. సైరా విషయంలో మాత్రం ఆ స్థాయి బిజినెస్ జరగలేదు. 50 కోట్లకు ఈ చిత్రంను అమ్మేందుకు చరణ్ చాలా ప్రయత్నించాడు. కాని 40 లోపు మాత్రమే ఈ సినిమా బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. సైరా హిందీ డబ్బింగ్ రైట్స్ విషయంలో చాలా చర్చలు జరిగాయి. అమితాబచ్చన్ వంటి బాలీవుడ్ మెగాస్టార్ నటించడంతో ఆ పాటి జరిగిందనే వారు కూడా ఉన్నారు. మొత్తానికి సాహో మరియు సైరాల మద్య వ్యత్యాసం మాత్రం చాలా కనిపిస్తుంది. మరి విడుదల తర్వాత కూడా ఇది అలాగే కొనసాగేనా లేదా చూడాలి.