Site icon TeluguMirchi.com

సాహో మొత్తంలో ఆ 12 నిముషాలు మాములుగా ఉండదట..

ఎక్కడ చూసిన..ఎక్కడ విన్న సాహో..సాహో ..సాహో ఈ మాట తప్ప మరో మాట వినిపించడం లేదు. 30 తారీఖు ఎప్పుడు వస్తుందా..ఎప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఎంతో ఆతృతగా ఉన్నారు. వారి ఆతృతను ఇంకాస్త ఆత్రుత పెంచుతున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే టీజర్స్ , మేకింగ్ , ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు పెంచగా..తాజాగా సినిమాలోని 12 నిమిషాలకు సంబందించిన వివరాలు మరో లెవల్ కు తీసుకెళ్తున్నాయి.

సాహో ప్రీ క్లైమాక్స్ లో 12 నిమిషాల పాటు సాగే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్ మతి పోగొడుతుందట. దీనికే సుమారు 80 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు తెలిసింది. ట్రైలర్ లో చూసిన శాండ్ ఫైట్ ఇందులో భాగంగానే వస్తుందని తెలిసింది. ప్రీ క్లైమాక్సే ఈ లెవెల్ లో ఉంటే ఇక క్లయిమాక్స్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.అది ఎలా ఉంటుందనేది మాత్రం సస్పెన్స్ అంటున్నారు.

Exit mobile version