Site icon TeluguMirchi.com

సూర్య మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా.?

s3-titleహీరో సూర్య కు తమిళం లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనే అంతే ఉంది..ఆ క్రేజ్ కు తగట్టే సినిమా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. కానీ కథను ఎంచుకున్న తీరు ను ఆ కథ టైటిల్ ఫై పెట్టడం లేదని అందరూ సూర్య ను విమర్శిస్తున్నారు..ఏ చిత్రనికైనా టైటిల్ అనేది చాల ముఖ్యం. టైటిల్ ఎంతబాగుంటే అంత ప్రేక్షకులకు నచ్చుతుంది. కానీ సూర్య మాత్రం ప్రేక్షకుల ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా తనకు నచ్చిన టైటిల్ ను పెట్టుకొని వస్తున్నాడు , దెబ్బ తింటున్నాడు.

యముడు.. సింగం వంటి మాస్ టైటిల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొట్టేసి కూడా.. ఇప్పుడు అదే సినిమాకు మూడో భాగం తీస్తూ.. టైటిల్ మాత్రం S3 అని పెట్టుకున్నాడు. ఇంటర్నేషనల్ కాప్ కథ కాబట్టి.. ఆ స్టైల్ లో టైటిల్ సెట్ చేసి ఉండచ్చు కానీ.. సింగం 3 లో ఉన్న పవర్ ఈ టైటిల్ లో S3 లేదనేది ఎవరికైనా అర్ధం అవుతుంది.

Also Read : రజనీ తర్వాత సూర్యదే రికార్డ్

ఇప్పుడు కాదు సూర్య గతం లో కూడా ఇలాగే నంబర్స్ సెంటిమెంట్ గా పెట్టుకొని వచ్చాడు..కథ బాగున్నా కానీ టైటిల్ పెద్దగా నచ్చక పోవడంతో ఆయా చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేకపోయాయి. దీనికి ఉదాహరణ 24 మూవీ అని చెప్పవచ్చు. కథ చాల కొత్తగా , అద్భుతంగా ఉన్నప్పటికీ టైటిల్ 24 ఉండేసరికి జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారు. మరి S3 తో ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.

Exit mobile version