Site icon TeluguMirchi.com

బోల్డ్ డైరెక్టర్ కు ఫుల్ డిమాండ్..

కథలో దమ్ముండాలే కానీ అగ్ర హీరోలా.. అగ్ర నిర్మాత..అగ్ర దర్శకుడా..అనేది చూడకుండా ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మ రధం పడతారని మరోసారి “ఆర్ఎక్స్ 100” తో రుజువయ్యింది. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ లను హీరో హీరోయిన్లుగా పెట్టి “ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన ఈయన , మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం రెండు కోట్లలో చిత్రాన్ని తెరకెక్కించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. దీంతో అజ‌య్ భూప‌తికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం అజ‌య్ భూప‌తితో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాతలు ఇంట్రస్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ హీరో రామ్ కి సరిపడ సబ్జెక్ట్ సిద్దం చేయమని చెప్పాడట. అలాగే భవ్య క్రియేషన్స్ నుంచి, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి నుంచి కూడా అజ‌య్ భూప‌తికి కాల్స్ వచ్చాయని తెలుస్త్తుంది. మరి అజయ్ ఎవరికీ ఓటు వేస్తాడో చూడాలి. ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 విడుదలైన అన్ని సెంటర్ లలో విజయవంతంగా రన్ అవుతుంది. ముఖ్యం గా ఈ సినిమాను చూసేందుకు యూత్ పోటీపడుతున్నారు.

Exit mobile version