Site icon TeluguMirchi.com

‘ఆర్ఎక్స్ 100’ కలెక్షన్స్ చూస్తే అగ్ర హీరోలు కుల్లుకుంటారు..

కథ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలే కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షమే అని మరోసారి ‘ఆర్ఎక్స్ 100’ తో రుజువయ్యింది. సినిమా హిట్ అవ్వడానికి భారీ బడ్జెట్ , భారీ కాస్ట్ & క్రూ , భారీ సాంకేతిక వర్గం అవసరం లేదని ఆర్ఎక్స్ 100 తో రుజువు చేసాడు డైరెక్టర్ అజయ్ భూపతి. కేవలం రెండు కోట్ల పైబడి తో తెరకెక్కించిన ఈ మూవీ ప్రస్తుతం నిర్మాతలకు , బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కేవలం ఐదు రోజుల్లో 6,14,36,237/- కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అగ్ర నిర్మాతలు , హీరోలు కుల్లుకునేలా చేసింది.

వీకెండ్ రోజుల్లోనే కాదు వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ తో దూసుకుపోతుంది. ముఖ్యం గా యూత్ అయితే ఈ సినిమా కోసం పరుగులు పెడుతున్నారు. ఇక ఈ ఐదు రోజుల్లో ఏ ఏ ఏరియాలో ఎలా కలెక్ట్ చేసిందో మీరే చూడండి.

నైజాం ——> 2,90,81,287/-
సీడెడ్ ——> 70,49,048/-
నెల్లూరు ——> 13,22,730/-
గుంటూరు ——> 41,72,183/-
కృష్ణ ——> 39,18,451/-
పశ్చిమ గోదావరి ——> 38,58,962/-
తూర్పు గోదావరి ——> 49,29,005/-
ఉత్తరాంధ్ర ——> 71,04,571/-
మొత్తం ——> 6,14,36,237/-

Exit mobile version