Site icon TeluguMirchi.com

అవి పుకార్లేనన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కొత్త షెడ్యూల్‌ను త్వరలో ఉత్తర భారత దేశంలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో రామ్‌ చరణ్‌ మరోసారి గాయపడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో చరణ్‌ గాయం కారణంగానే నార్త్‌ ఇండియా షెడ్యూల్‌ డిస్ట్రబ్‌ అయ్యింది. ఆ కారణంగానే మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌కు బ్రేక్‌ పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చ జరిగింది.

మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించారు. రామ్‌ చరణ్‌కు గాయం అయ్యిందని, షూటింగ్‌ ఆలస్యం అవుతుందంటూ వస్తున్న వార్తలు నిజం కాదంటూ వారు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. సినిమా చిత్రీకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఖచ్చితంగా సినిమా అనుకున్న సమయంకు విడుదల చేసి తీరుతాం అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. వచ్చే ఏడాది జులై 30న సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. మరి చిత్రీకరణ విడుదల ఉంటుందో లేదో చూడాలి.

Exit mobile version