RRR నైజాం రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

రాజమౌళి నుండి సినిమా అంటే ఆ అంచనాలు తారాస్థాయికి వెళ్లాల్సిందే..ఇంతవరకు అపజయం అంటే ఏంటో తెలియని ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఈయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘#RRR’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కలయికలో స్వాతంత్ర్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఫై అన్ని భాషల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో అన్ని ఏరియాల రైట్స్ కోసం పోటీ విపరీతమవుతుంది.

రీసెంట్ గా రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్ర నిర్మాత దానయ్య..ఇప్పుడు బిజినెస్ ను మొదలుపెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయనే వార్త ఫిలింనగర్‌లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైజాం థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. కరెక్ట్ ఫిగర్ బయటకు రాలేదు కానీ దాదాపు రూ.100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని తెలుస్తోంది. మరి ఇది నిజామా కదా అనేది తెలియనప్పటికీ ఈ రేటు మాత్రం వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.