సౌత్ సినిమాలకు ఈమద్య కాలంలో ఓవర్సీస్‌లో వస్తున్న వసూళ్లను చూసి అవాక్కవతున్నారు. తాజాగా దుబాయికి చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఓవర్సీస్ రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు మందుకు వచ్చింది. ఏకంగా 65 కోట్లకు పైగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 30 కోట్ల అడ్వాన్స్‌ను కూడా ఇవ్వనున్నారు. దానయ్య ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒప్పందం చేసుకునే పనిలో ఉన్నాడు. ఓవర్సీస్‌లో 100 కోట్లు వసూళ్లు చేయగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. అందుకే 65 కోట్ల బిజినెస్ అనేది మామూలు విషయమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.