#RRR ఫస్ట్‌ బిజినెస్‌ ఎంతో తెలుసా?

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటేనే బాబోయ్‌ అన్నట్లుగా ఉంది. బాహుబలి తర్వాత అంతటి భారీ స్థాయి చిత్రాన్ని చేయాలనే ఉద్దేశ్యంతో చాలా గ్యాప్‌ తీసుకుని రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది. అద్బుతమైన కథా నేపథ్యంతో ఈ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అప్పుడే ప్రకటించాడు. కాస్త అటు ఇటుగా వచ్చే ఏడాది సినిమా రావడం అయితే కన్ఫర్‌. ఇంకా ఏడాది ఉండగానే సినిమా బిజినెస్‌ ప్రారంభం అయ్యింది.

సౌత్‌ సినిమాలకు ఈమద్య కాలంలో ఓవర్సీస్‌లో వస్తున్న వసూళ్లను చూసి అవాక్కవతున్నారు. తాజాగా దుబాయికి చెందిన ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కంపెనీ ఓవర్సీస్‌ రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు మందుకు వచ్చింది. ఏకంగా 65 కోట్లకు పైగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 30 కోట్ల అడ్వాన్స్‌ను కూడా ఇవ్వనున్నారు. దానయ్య ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒప్పందం చేసుకునే పనిలో ఉన్నాడు. ఓవర్సీస్‌లో 100 కోట్లు వసూళ్లు చేయగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. అందుకే 65 కోట్ల బిజినెస్‌ అనేది మామూలు విషయమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.