Site icon TeluguMirchi.com

ఆర్ఆర్ఆర్ లో ‘మల్లి’ ఎవరో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రేక్షకలోకాన్ని అలరిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని రాజమౌళి డైరెక్ట్ చేయగా..గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు కూడా కుమ్మేస్తుంది. ఇక ఈ మూవీ లో మల్లి అనే పాత్ర చేసిన చిన్నారి గురించి అంత ఆరా తీస్తున్నారు. సినిమా మొత్తం ఆ చిన్నారి చుట్టే తిరుగుతుంది. గిరిజన బాలిక గా నటించిన మల్లి..పేరు ట్వింకిల్‌ శర్మ.

ఛండీగర్ రాష్ట్రానికి చెందిన ఈ చిన్నారి డాన్స్‌ ఇండియా డాన్స్‌ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు పలు టీవీ యాడ్స్‌లో కూడా నటించింది. అయితే ఫ్లిప్‌ కార్ట్‌ యాడ్‌లో ఈ చిన్నారిని చూసిన రాజమౌళి ఆడిషన్‌కు పిలిపించి మల్లి పాత్రకు సెలక్ట్‌ చేశారట. ఈ చిత్రంలో ‘నన్ను ఈడ ఇడిసిపోకన్న.. అమ్మ యాదికొస్తాంది’ అంటూ మల్లీ చెప్పే డైలాగ్‌ గుండెల్ని పిండేసేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ చిన్నారికి వరుస ఛాన్సులు వస్తున్నట్లు సమాచారం.

Exit mobile version