Site icon TeluguMirchi.com

ఆర్ఆర్ఆర్ కే పోటీ ఇవ్వబోతున్నాడు..

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 08 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. పీరియాడిక్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తుండగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమాకు పోటీగా విజయ్ రాబోతున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి అంటే కేవలం తెలుగు సినిమాలకే కాదు తమిళ్ సినిమాలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకే విజయ్ పొంగల్ కు తన సినిమాను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. సుధ కొంగరతో చేస్తోన్న కొత్త చిత్రాన్ని పొంగల్ కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అవుతుంది. మరి ఆర్ఆర్ఆర్ కు పోటీ గా విజయ్ వస్తాడా..వచ్చి గెలుస్తాడా అనేది చూడాలి.

Exit mobile version