Site icon TeluguMirchi.com

జాతీయ చలనచిత్ర అవార్డుల్లోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హవా..


భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో జరిగిన జ్యూరీ విలేకరుల సమావేశంలో విజేతలను ప్రకటించారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలతో పాటు, ఆస్కార్ అవార్డును సైతం చేసుకుంది. ఇక నేషనల్ అవార్డ్స్ లోనూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ హవా కొనసాగింది.

ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: కింగ్‌ సాలమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం :ఆర్‌ఆర్‌ఆర్‌, ఉత్తమ సంగీతం(నేపథ్య): కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌), ఉత్తమ విజువ‌ల్ ఎఫెక్ట్ : వి శ్రీనివాస్(ఆర్‌ఆర్ఆర్‌), ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌- కొమురం భీముడో) ఇలా ఏకంగా ఆరు విభాగాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ అవార్డులను గెలుచుకుంది. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

ఇకపోతే జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్(పుష్ప) సొంతం చేసుకున్నాడు. కాగా ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమాకు దక్కింది. అయితే ఇది వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు(తెలుగు) కు అవార్డు దక్కింది.

Exit mobile version