ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో `ఆర్‌ఆర్‌ఆర్`, ‘ది కశ్మీరీ ఫైల్స్’ సత్తా చాటాయి. మొన్న గోల్డెన్ గ్లోబ్, నిన్న ఆస్కార్ నామినేషన్, ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో ఆర్ఆర్ఆర్ సినిమా ఖ్యాతి ఎల్లలు దాటుతోంది. మరోవైపు వివాదాస్పద చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్ సైతం’ అవార్డు సాధించింది. ఇక `ఆర్‌ఆర్‌ఆర్`కి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కగా, `ది కాశ్మీర్ ఫైల్స్` ఉత్తమ చిత్రంగా నిలవడం విశేషం. మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న `కాంతార` ఫేమ్ రిషబ్ శెట్టి.. ఈ ప్రతిష్టాత్మక అవార్డును దివంగత లెజెండ్స్, నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరియు దర్శకుడు ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేశారు.
2023ఏడాదికిగానూ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ముంబయిలో సోమవారం రాత్రి గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో 2022 ఏడాదికి సంబంధించి భారతీయ చిత్రాలకు పురస్కారాలు అందించారు. ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.
ఇక అవార్డుల వివరాలు చూస్తే,
ఉత్తమ చిత్రం.. ది కశ్మీర్ ఫైల్స్
ఉత్తమ దర్శకుడు.. ఆర్.బల్కీ (చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్)
ఉత్తమ నటుడు.. రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1)
ఉత్తమ నటి.. ఆలియా భట్ (గంగూభాయి కతియావాడి)
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్.. రిషబ్ శెట్టి (కాంతారా)
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్.. వరుణ్ ధావన్ (బేడియా)
మోస్ట్ వెర్సటైల్ యాక్టర్.. అనుపమ్ ఖేర్
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్.. సాచిత్ తాండన్
క్రిటిక్స్ ఉత్తమ నటి.. విద్యా బాలన్ (జల్సా)
ఉత్తమ సహాయ నటుడు.. మనీష్ పాల్ (జగ్ జగ్ జీయో)
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్.. ఆర్ఆర్ఆర్