రాంగోపాల్ వర్మ బహు రొమాంటిక్. దాన్ని కాదనేవారు ఎవరు..? నాతో పరిచయం పెంచుకోవాలంటే అందమైన ఆడదానిగా పుట్టడం దగ్గరి మార్గం.. అని బహిరంగంగానే చెప్పాడు వర్మ. చీకట్లో కెమెరా తిప్పినా… హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి కలర్ఫుల్గా చూపించేస్తాడు. రంగీలా ఊర్మిళా నుంచి నథాలియా వరకూ అందరికీ వెండితెరపై లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు శాన్వినీ అంతే రసవత్తరంగా చూపిస్తున్నాడు. రౌడీ కోసం. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో శాన్వికథానాయిక. ఈ సినిమాలోని ఓ గీతాన్ని నేరుగా యూ ట్యూబ్‌లో విడుదల చేశాడు వర్మ. అందులో శాన్వి పాపరి సూపర్ గా చూపించాడు. విష్ణు, శాన్విల మధ్య సాగే రొమాంటిక్ గీతమిది. రౌడీ పేరు ఎంత రఫ్‌గా ఉందో.. ఈ పాట అంత రసవత్తరంగా ఉంది. వర్మ అంటే… అంతే. అందమైనా, రక్తపాతమైనా అలానే చూపిస్తాడు.