వర్మ స్టైలే వేరు. అందరిలా ఆలోచించడు. పోస్టర్ విషయంలోనూ అంతే. శివతోనే ఈ సంగతి అర్థమైంది. ఇప్పుడు ‘రౌడీ’ పోస్టర్ లోనూ ఆ ముద్ర కనిపించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రౌడీ. మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కేవలం 18 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు వర్మ. ఇప్పుడు ఫస్ట్ లుక్ తోనూ అదరగొట్టాడు. ఓ రఫ్… బ్యాక్ గ్రౌండ్లో మోహన్ బాబుని వెనుక నుంచి చూపించి.. తనదైన పనితనాన్ని చూపించాడు. మోహన్ బాబు మొహం కనిపించడం లేదు గానీ.. ఆ తాలుకూ ఎఫెక్ట్ మాత్రం ఈ పోస్టర్ లో ప్రతిబింబించింది. టీజర్ ని కూడా అతి త్వరలో చూపించబోతున్నారు. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.