లాజిక్ లేని `రౌడీ ఫెలో`

naraబాణం, సోలో సినిమాల‌తో ఆక‌ట్టుకొన్నాడు నారా రోహిత్‌. ఇటీవ‌ల వ‌చ్చిన ప్ర‌తినిధి కూడా అల‌రించింది. శంక‌ర విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు రౌడీ ఫెలోగా త‌న‌లో ఉన్న మాస్ కోణాన్ని బ‌య‌ట‌పెట్టాల‌నుకొంటున్నాడు రోహిత్‌. గీత ర‌చ‌యిత‌ కృష్ణ చైత‌న్య తొలిసారి ద‌ర్శక‌త్వం వహిస్తున్న చిత్రమిది. విశాఖ సింగ్ క‌థానాయిక‌. ఈ చిత్రం ఫస్ట్ లుక్  ఈరోజే విడుద‌ల చేశారు.  చేశారు. అర‌వై సెక‌న్ల‌లో 72సార్లు కొట్టుకొనే గుండెకే లాజిక్ లేదు. నేను చేసిన ప‌నుల గురించి అడిగితే ఏం చెబుతానురా… అనే డైలాగ్ తో ఓ టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు.  ఈ సినిమాలో రోహిత్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంద‌ని, అత‌నిలోని పూర్తిస్థాయి మాస్ కోణాన్ని ఈ సినిమాతో ఎలివేట్ చేసే చిత్ర‌మిద‌ని యూనిట్ చెబుతోంది.  చిత్రానికి సన్నీమ్యూజిక్ అందించాడు. జూన్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.