Site icon TeluguMirchi.com

Operation Valentine : వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి రొమాంటిక్ మెలోడీ రిలీజ్..


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. ఇక ఇప్పటికే ఈచిత్రం నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ వందేమాతరం అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. తాజాగా ఈ సినిమా నుండి రొమాంటిక్ మెలోడీని రిలీజ్ చేసారు మేకర్స్.

ఈ సినిమాలోని రొమాంటిక్ లేయర్‌ని చూపించడానికి, మేకర్స్ రెండవ సింగిల్ ‘గగనాల..’ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీని అందించాడు. లీడ్ పెయిర్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న లవ్ బర్డ్స్ గా మెస్మరైజింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్ ఆకట్టుకునేలా పాడారు. ఇకపోతే ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Gaganaala | Operation Valentine | Varun Tej | Manushi Chhillar | Mickey J Meyer | Armaan Malik

Exit mobile version