ఫస్ట్ లుక్ టాక్ : రొమాంటిక్ – మరి ఇంత రొమాన్సా..

ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రాలు కూడా బాలీవుడ్ , హాలీవుడ్ చిత్రాలను బీటు చేస్తున్నాయి. అంటే కలెక్షన్లలో కాదు రొమాన్స్ లో ఘాటైన లిప్ లాక్ లు , శృంగార భరిత సన్నివేశాలు, ముద్దు లు అబ్బో ఇలా ఒకటి ఏంటి ఎన్ని చూపించాలో అన్ని చూపిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా పూరి నిర్మిస్తున్న రొమాంటిక్ కూడా అదే కోవా కు చెందినదిగా ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది.

ఆకాశ్ పూరి, కేతికా శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను సోమవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కేతికా శర్మ టాప్ లెస్‌గా కనిపించగా ఆకాశ్ పూరిని గట్టిగా హత్తుకుంది. ఆ హాట్ కౌగిలి ఆవిరిలోని ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు ఆకాశ్ పూరి. ఈ ఫస్ట్ లుక్ యూత్ కు మంచి కిక్ ఇస్తుంది. మరి సినిమాలో ఇంకెన్ని కిక్ ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయో చూడాలి.