Site icon TeluguMirchi.com

రొమాంటిక్ బాల‌య్య‌

balakrishna(2)బాల‌కృష్ణ అంటేనే భారీ డైలాగులూ, తొడ‌గొట్ట‌డాలూ, మీసం మెలేయ‌డాలూ.. ఇవ‌న్నీ చూపించి సింహాని హిట్ చేశాడు బోయ‌పాటి శ్రీ‌ను. ఇప్పుడు బాల‌య్య‌లోని రొమాంటిక్ హీరోనీ బ‌య‌ట‌కు తీసుకొస్తున్నాడ‌ట‌. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న చిత్రం లెజెండ్‌. ఇందులో బాల‌కృష్ణ కాస్త రొమాంటిక్ గా చూపిస్తున్నాడ‌ట బోయ‌పాటి. ముఖ్యంగా సోనాలీ చౌహాన్‌, బాల‌య్య మ‌ధ్య సాగే స‌న్నివేశాలూ, పాట‌లు బాల‌య్య‌ను స‌రికొత్త‌గా ఆవిష్క‌రిస్తాయ‌ట‌. బాల‌య్య‌, సోనాలీల లేటెస్ట్ ఫొటో ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిజంగానే అందులో బాల‌య్య బ‌హు రొమాంటిక్ గా క‌నిపిస్తున్నాడు. ఈనెల 7న హైద‌రాబాద్‌లోని శిల్పారామంలో లెజెండ్ పాట‌ల్ని విడుద‌ల చేయ‌నున్నారు. మార్చి 28న లెజెండ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాడు.

Exit mobile version