రజిని ‘రోబో 2.0’ లుక్ ఇదే..

Robo-2.0-lookరజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం రోబో 2.0. ఇటివలే ఈ చిత్రం మొదలు పెట్టిన సంగతి తెల్సిందే..అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రజనీకాంత్ లుక్ ఎలా ఉండబోతుండా అనే టెన్షన్ అందరిలో మొదలయ్యింది..

తాజాగా ఆ లుక్ ని బయటకు రిలీజ్ చేసాడు రాకీ ఎస్..ఈ చిత్రానికి ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న ఈయన రోబో 2.0 సెట్స్ లోని రజిని లుక్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు..ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే విపరీత మైన లైక్స్, షేర్ లు వచ్చాయి..ఈ లుక్ లో రజిని అదరగొట్టాడు అనే కామెంట్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషించనున్నాడు. ఐ సినిమాలో అందాలతో కిక్కెక్కించిన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. మూవీకి రెహ్మాన్ మ్యూజిక్ అందించగా, కెమరా మాన్ గా నిరవ్ షా చేస్తున్నాడు. పైసా వసూల్, ధూమ్ లాంటి చిత్రాలకు నిరవ్ కెమెరామెన్‌గా పనిచేశారు. లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.