ఇప్పుడు రోబో కు సీక్వల్ గా రాబోతున్న చిత్రమే రోబో 2.0. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నెగిటివ్ రోల్ లో కనిపించగా అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబదించిన ఓ న్యూస్ రజని అభిమానులను తెగ సంబర పెడుతుంది. అదేంటి అంటే రోబో 2.0 ఫస్ట్‌లుక్‌ను నవంబర్‌లో రిలీజ్ చేయబోతున్నారనే విషయాన్ని లైకా నిర్మాణ సంస్థ ప్రతినిధి రాజు మహాలింగం సోషల్‌మీడియా ద్వారా తెలియపరిచారు. నవంబర్లోనే మూవీ ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
రోబో తర్వాత ఆ స్థాయి హిట్ రజనికి దక్కకపోవడంతో అభిమానులు రోబో 2.0 ఫై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి వారి ఆశలను ఈ చిత్రమైన నింపుతుందో లేదో చూడాలి.