సూపర్ స్టార్ రజనీ కాంత్, సంచలన డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. 2010లో వచ్చిన ఈ సినిమా రజనీ కేరీర్లోనే హయ్యస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నమోదు చేసుకుంది. ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు రోబో 2.0 వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ముగించుకున్న చిత్ర యూనిట్ , తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 20 ఆదివారం నాడు ఈ టీజర్ ను తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో రిలీజ్ చేయబోతున్నారట. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రం లో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్నారు.