Site icon TeluguMirchi.com

రోబో 2 క్లైమాక్స్ అప్డేట్..

Robo2-climaxసంచలన డైరెక్టర్ శంకర్-సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రోబో 2.0 తాజాగా క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం..రజని ఆరోగ్యం బాగాలేకపోవడం తో కొన్ని రోజులు షూటింగ్ ఆపేసిన చిత్ర యూనిట్ తాజాగా క్లైమాక్స్ షూట్ ను పూర్తి చేసింది.పాటలతో పాటు కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట, అవి కూడా పూర్తియితే సినిమా మొత్తం కంప్లీట్ అయ్యినట్లే అని సమాచారం.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ చిత్రం లో విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు..ఈ క్లైమాక్స్ షూట్ ఎర్రకోట, పార్లమెంట్ పరిసరాల్లో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఆ రెండింటినీ చెన్నైలో సెట్ వేసి పూర్తిచేసినట్లు తెలుస్తుంది. 2017 చివరికల్లా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం లో రజనికి జోడిగా అమీజాక్సన్ నటిస్తున్న సంగతి తెలిసిందే..

Exit mobile version