Site icon TeluguMirchi.com

హీరోలపై మరోసారి వర్మ కారుకూతలు

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన కామెంట్‌లు చేస్తూ తరుచూ వార్తల్లోకి వస్తాడు. తాజాగా ‘బాహుబలి 2’ చిత్రాన్ని వీక్షించిన వర్మ టీంను ఆకాశానికి ఎత్తేశాడు. ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. తాజాగా వర్మ మరోసారి స్టార్‌ హీరోలపై కారు కూతలు కూశాడు. ప్రభాస్‌కు కులాల మీద పెద్దగా పట్టింపు లేదు కాబట్టి ఇలా నేషనల్‌, ఇంటర్నేషనల్‌ హీరో అయ్యాడు. కానీ లోకల్‌ హీరోలు మాత్రం కాపులు, కమ్మలుగా విడిపోయి కేవలం లోకల్‌గానే మిగిలిపోయారు. రాజుల కులమైన ప్రభాస్‌కు అలాంటి ఫీలింగ్‌ లేదు కాబట్టి ప్రభాస్‌ ఈ స్థాయికి చేరుకున్నాడు అంటూ వర్మ మిగతా హీరోలపై వ్యంగ్యంగా ట్వీట్లు చేశాడు.

కులాల పిచ్చి ఉన్న స్టార్‌ హీరోలు ప్రభాస్‌ను ఇక తాకలేరు, కులాలను పట్టుకుని వేలాడే హీరోలు కేవలం రాష్ట్రానికే పరిమితం అవుతారు అని, లోకల్‌ అభిమానుల గురించి ఆలోచించే వారు లోకల్‌ గానే మిగిలిపోతారు, ప్రభాస్‌ గురించి లోకల్‌ అభిమానులు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ స్థాయి ప్రస్తుతం లోకల్‌ కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరింది అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు.

Exit mobile version