Site icon TeluguMirchi.com

వర్మ సెన్సార్ యుద్ధం !

varmaరీజనల్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి పై రామ్ గోపాల్ వర్మ క్రిమీనల్ కేసు పెట్టనున్నారు. ఇదే అంశం పై ఓ టి.వి చానల్ లో మాట్లాడారు. సత్య 2కి హిందీలో 2 కట్స్ ఇచ్చారు. అదే తెలుగు లో 44కట్స్ చేశారు.నా సినిమానే కాదు చాలా సినిమాలు రీజనల్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి టార్చర్ కు బలైపోతున్నాయి. ఈ విషయం లో నేను న్యాయ పోరాటం చేయడానికి రెడీ అయ్యాను. ఈ రోజు నాంపల్లి కోర్టు లో కేసు ఫైల్ చేస్తున్నాను. పూర్తి వివరాలు నా లాయర్ మీడియాకు అందిస్తారు అని తెలిపారు వర్మ. ఈ విషయంలో ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ధనలక్ష్మి వల్ల సమస్యలు ఎదుర్కొన్న నిర్మాతలు వర్మకు సపోర్ట్ ఇవ్వనున్నారని సమాచారం. మరి చూడాలి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో.

Exit mobile version